విజయనగరం జిల్లా రాజాం : : మున్సిపల్ కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికై జూలై 20 న మున్సిపల్ కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయాలని మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు ఏ, జగన్ మోహన్ రాజాంలో మున్సిపల్ కార్మికుల సమావేశంలో పిలుపునిచ్చారు మాట్లాడుతూ జులై 6 నుండి ఆగస్టు 17 వరకు దశలు వారీగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై ఆందోళన నిర్వహిస్తామని, కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి, 2022 జూలైలో జరిగిన సమ్మె సందర్భంగా మంత్రులు ,అధికారులు ఇచ్చిన హామీలు అమలు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన వై.యస్. జగన్మోహన్రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలులోగా కాంట్రాక్ట్ కార్మికులని పర్మినెంట్ చేస్తామని, ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని శాసనసభలోనే ప్రకటించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఈ హామీలను నెరవేర్చలేదు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 40 వేల మంది మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల ను మాట తప్పి మోసం చేయాలని ప్రయత్నం సరైనది కాదని, ఎన్నికల హామీలు భాగంగా 90 శాతం అమలు చేశామని చెప్తున్నా మీరు మున్సిపల్ కార్మికుల ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, ఈ రంగంలో పనిచేసిన కార్మికులకు కనీస వేతనాలు కానీ కనీస సౌకర్యాలు గాని సమాన పనికి సమాన వేతనం గానీ అమలు చేయకుండా తీవ్రంగా ప్రభుత్వమే దోపిడీ చేయడం దుర్మార్గమని విమర్శించారు మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంపుదల చేయాలి.
కార్మికులకు యూనిఫాం, రక్షణ, భద్రత సౌకర్యాలు, పనిముట్లు సకాలంలో అందించాలి,తోపుడు బళ్ళు, ట్రాక్టర్స్, కాంపేటర్స్ తక్షణమే బాగు చేయాలి
రిటైర్డ్, చనిపోయిన కార్మికుల స్థానములో కార్మికులను నియమించాలి. కార్మికులందరికీ ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు వెంటనే కేటాయించాలి మొదలగు సమస్యల పరిష్కారం కోసం దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు యూనియన్ అధ్యక్షు కార్యదర్శులు రాజేష్, చిన్న బాబు, కాశీ, బాలరాజు,కృష్ట,శంకర్రావు,కనకరాజు, సింహాచలం,అనిల్ కుమార్,శ్రీనివాసరావు, రవి, శోభన్ బాబు, లక్ష్మి, మొదలగుపాల్గొన్నారు
