ఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభవార్త తెలిపారు. 2024లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డీఆర్ఎఫ్) కింద రూ. 1554.99 కోట్ల అదనపు సహాయం అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అయిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిధుల మంజూరును ఆమోదించింది. ఇక మొత్తం రూ. 1554.99 కోట్లలో ఏపీకి రూ. 608.8 కోట్లు, తెలంగాణకు రూ. 231.75 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ. 170.99 కోట్లు ఇవ్వాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది.