ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చి పోయే జనంతో రద్దీగా ఉండే షాబాద్ డైరీ ప్రాంతంలోని వీధిలో ఆదివారం రాత్రి జరిగింది ఈ ఘోరం 16 ఏళ్ల బాలిక సాక్షి ఇంతటి ఉన్మాదానికి తెగించింది ఆమె ప్రియుడు 20 ఏళ్ల సాహిల్ అనే యువకుడు చంపిన ఘటన వీడియో వైరల్ గా మారింది. కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అయితే ఇద్దరి మధ్య గొడవ ఈ దారుణ హత్యకు దారితీసింది అని తెలుస్తుంది. ఢిల్లీ పోలీసుల వివరాల, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సాహిల్ ఫ్రిడ్జ్ ఏసీ మెకానిక్ గా పని చేస్తున్నాడు, సాహిల్ షాబాద్ డైరీ ప్రాంతం జేజే కాలనీకి చెందిన సాక్షి అనే బాలిక ప్రేమించుకున్నారు. శనివారం వారిద్దరు గొడవ పడ్డారు దీన్ని మనసులో పెట్టుకున్న సాహిల్ సాక్షిని సంపాలని పథకం వేశాడు. బాలిక తన స్నేహితురాలి ఇంట్లో జరిగే వేడుక కోసం షాపింగ్ చేసేందుకు ఒంటరిగా బయలుదేరగా దారి కాచి అడ్డుకున్నాడు వెంట తెచ్చుకున్న కత్తితో సాక్షిని విచక్షణారహితంగా పొడిచి చంపాడు మృతి చెందిందని నిర్ధారించుకొని మళ్లీ వెనక్కి వచ్చి మృతదేహాన్ని కాలితో తన్నాడు బండరాయం తీసుకొని పలుమార్లు మృతదేహం మీద వేశాడు ఇదంతా ఆ ధారిన అటు ఇటు వెళుతున్న జనం చూసారే గాని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఒకరిద్దరు ఆగి చూసిన వారిని సాహిల్ బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. బాలికను చంపి నానా బీభత్సం సృష్టించిన అనంతరం సాహిల్ అక్కడి నుండి పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృదాలతో వేట మొదలు పెట్టిన పోలీసులు సోమవారం అతడిని యూపీ లోని బులం షహర్ లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు కీలక ఆధారాలు సేకరించి నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని స్పెషల్ పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ దీపేంద్ర పాట్టాక్ పేర్కొన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.