అమరావతి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu veerraju) బెంగుళూరు నుంచి ఢిల్లీ (Banglore to Delhi) వెళ్లారు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను శివప్రకాష్జీకి వివరించారు.మొన్న సోము వీర్రాజు, నిన్న చంద్రబాబు (Chandrababu).. పవన్ (Pawan)ను కలవడంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. విశాఖ ఘటన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government), నేతల మీద పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తీరు పైనా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. రూట్ మ్యాప్ అంశాన్ని ప్రస్తావిస్తూ .. అవసరమైతే తన విధానం మార్చుకోవాల్సి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, పవన్ వ్యాఖ్యలను బీజేపీ పెద్దల దృష్టికి సోము వీర్రాజు తీసుకెళ్లారు. నేటి సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.