న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ పోలీస్ కంట్రోల్ రూంకు బుధవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు… ఘటనాస్థలికి చేరుకొని సోదాలు జరుపగా ఎటువంటి పేలుడు పదార్థాలు అక్కడ దొరకలేదు. నార్త్ బ్లాక్‌లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంది. గత కొన్నిరోజులుగా పలు ప్రాంతాల్లో ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్, జైపూర్, ఉత్తర ప్రదేశ్, బెంగళూరులోని పలు పాఠశాలలకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ అన్నీ వట్టివేనని తేలింది.