సిద్దిపేట జిల్లా: గత ఏడు రోజులుగా బెజ్జంకి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధిలో ఉన్నాయి అంటే గ్రామపంచాయతీ సిబ్బంది శ్రమ గొప్పదన్నారు,రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బంది యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ఒంటెద్దు పోకడ పోతుందన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి,కారోబార్ లను బిల్ కలెక్టర్లగా ప్రమోషన్ కల్పించి, సఫాయి కార్మికులకు వేతనాలను ప్రస్తుతం ఉన్న నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య బీమా అందించాలని కోరారు పీఎఫ్ లను అందించాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దొంతర వేణి మహేష్ కట్కూరి నరేష్ రోడ్డ చరణ్ తదితరులు పాలుగోన్నారు.