- మాట ఇస్తే మడమతిప్పని నాయకుడు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
- ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభం
- సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండల కేంద్రంలో గుంతల రోడ్డు ద్వారా ప్రజలు ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట ఇచ్చి…ఇచ్చిన మాటకు కట్టుబడి సీసీ రోడ్డు వేయిస్తున్నారని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణ రెడ్డి అన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కమిట్ మెంట్ ఉన్న నాయకుడని, చిత్తకార్తె కుక్కలు ఎన్ని మొరిగిన నిత్యం ప్రజల సంక్షేమం కోసమే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కుక్కకు బొక్క దొరికినట్లు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆకాశం ఊడిపడినట్లు కుట్ర రాజకీయాలు చేశారని… ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏ అభివృద్ధి పనైనా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిందేనని, ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు మీ తలకాయలు పెట్టుకుంటారని దుయ్యబట్టారు.మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఒక సారి మాట ఇస్తే మడమ తిప్పరని… ఎన్ని అడ్డంకులు ఎదురైన ఎదురొడ్డి నిలబడి ప్రజల సంక్షేమం…గ్రామాల అభివృద్ధి కోసం పని చేసే ప్రజానాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు,ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, పాక్స్ చైర్మన్ రోండ్ల తిరుపతి రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ సాదులు, మరియు వార్డు సభ్యులు గ్రామ నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.