contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేంద్ర నిధుల ద్వారానే గ్రామ పంచాయతీల అభివృద్ధి

  • ఇంటింటి ప్రచారంలో బిజెపి మానకొండూర్ నేతలు

కరీంనగర్ జిల్లా:మానకొండూరు నియోజకవర్గం లోని మానకొండూరు మండల కేంద్రంలో మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఇంటింటికీ బీజేపీ అనే నినాదంతో మానకొండూరు మండల కేంద్రంలోని 5,6,7 బూతులలో పర్యటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ ,మనకొండూర్,నియోజకవర్గం ఇంఛార్జి గడ్డం నాగరాజు హాజరై మాట్లాడుతూ. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పేదలకు అనుసంధానం చేసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ కి దక్కుతుందని,గతంలో కేవలం పెద్దలకే…అనే అభిప్రాయాన్ని తొలగించి 48 కోట్ల జన్ దన్ ఖాతాలు అందించారని,అలాగే కరోనా సమయంలో దాదాపు 80 కోట్ల మందికి ప్రధాన మంత్రి యోజన ద్వారా ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది , రాష్ట్రంలోని గ్రామపంచాయతి లు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ విధానాలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను, కార్యకర్తలు భుజాన వేసుకోవాలని, తెలంగాణలో బీజేపీ అధికారం సాధించడమే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పని తిరుపతి , మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ప్రధాన కార్యదర్శి సొన్నకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్, కోశాధికారి మీసా రమణయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు బాషబోయిన ప్రదీప్ యాదవ్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, బూత్ అధ్యక్షులు నందగిరి బలరాం,కొండ్రా హరీష్, నాయకులు రమేష్ బీజేవైఎం మండల కార్యదర్శి బోయిని అభిషేక్, నాయకులు బోయిని హరీష్,కొంకటి అనిల్, రమేష్ తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :