- మాచర్ల నియోజకవర్గంలో రైతులకు పంట భీమా, ఆర్ అండ్ బి రోడ్లు, నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి
పల్నాడు జిల్లా : మాచర్ల నియోజకవర్గంలో అస్తవ్యాస్తంగా ఉన్న ఆర్ అండ్ బి రోడ్లకు ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి నిధులు మంజూరు చేసారని మాచర్ల జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి శనివారం తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు రోడ్లకు సంబంధించి ఆర్ అండ్ బి శాఖ ద్వారా 13.60 కోట్లు మంజూరు అయ్యాయని నరమాలపాడు ఎస్సి కాలనీ నుండి ఒప్పిచర్ల జంక్షన్ వరకు 5.88 కిలోమీటర్లు రోడ్డుకు 2.30కోట్లు అలాగే కారంపూడి గ్రామం చివర నుండి ఒప్పిచర్ల జంక్షన్ వరకు 6.22 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికి 3.30 కోట్లు మంజూరు అయ్యాయని కారంపూడి నుండి కాచవరం గ్రామం వరకు 20.6 కిలోమీటర్లు రోడ్డుకు నాలుగు కోట్లు మంజూరు అయ్యాయని దుర్గి నుండి వెల్దుర్తి వరకు 17.6 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని వీటికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి 74వ జయంతి మరియు రైతు దినోత్సవం సందర్బంగా మాచర్ల నియోజకవర్గనికి గతంలో ఎప్పుడు లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పంట భీమా పథకం ద్వారా మాచర్ల నియోజకవర్గంలో మూడు మండలలలోని రైతులకు పంట భీమా మంజూరు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దుర్గి మండలనికి సంబంధించి 9982 మంది రైతులకు 8.92 కోట్లు మంజూరు అయ్యాయని రెంటచింతల మండలనికి సంబంధించి 5399 మంది రైతులకు 1.19 కోట్లు మంజూరు అయ్యాయని కారంపూడి మండలనికి సంబంధించి 5623 మంది రైతులకు 1.26 కోట్లు మంజూరు అయ్యాయని మొత్తం నియోజకవర్గంలో 21004 మంది రైతులకు 11.38 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని అయన అన్నారు. అలాగే రైతులకు పగటి పూట 9గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో కొత్తగా ఏడు 33/11 కే.వి విద్యుత్ సబ్ స్టేషన్ కొరకు గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ప్రతిపదన పంపించటం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గంలో 7 సబ్ స్టేషన్ ల నిర్మాణానికి 25 కోట్లు మంజూరు చేసారాని అయన తెలిపారు. నియోజకవర్గంలో చింతలతండ, కారంపూడి మండలం పేటసన్నేగండ్ల, కొత్తపల్లి, రెంటల, మాచర్ల సొసైటీ కాలనీ, రచ్చమాలపాడు (శ్రీరామపురం తండ), ఆత్మకూరు గ్రామాలకు నూతన సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇవి కాకా నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభనికి సిద్ధంగా ఉన్న 33/11 కే. వి సబ్ స్టేషన్లు మిరియాల, జట్టిపాలెం, గన్నవరం ఇవి కాకుండా కొత్తపల్లిలో 132/33 కే. వి సబ్ స్టేషన్ 40 కోట్ల రూపాయల అంచన వ్యయంతో డి.పి. ఆర్ సిద్ధం చేసి ప్రభుత్వనికి పంపటం జరిగింది. ఇవి కూడా తప్పకుండ మంజూరై వచ్చే నెలలో పనులు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.