నిజామాబాద్ జిల్లా : నవ నాథ సిద్దుల గుట్ట ఆర్మూర్ నందు నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం వద్ద ఈరోజు ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ధ్యాన ఆత్మజ్ఞాన దాతగా హిమాలయ యోగి 108 సంవత్సరాల శ్రీ సంతు సదానంద యోగి మహారాజు గారు విచ్చేసి ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆర్మూర్ సిద్దిలగుట్ట ఎంతో పుణ్య ప్రదేశమని ఎందరోమంది ఋషులు, మునులు ,యోగులు ధ్యానం చేసిన గొప్ప శక్తి క్షేత్రమని ఈ శక్తి క్షేత్రంపై ఇంత చక్కని పిరమిడ్ ధ్యానమందు నిర్మించడం చాలా ఆనందమని తెలిపారు. హిమాలయాలలో అనేక సంవత్సరాలు ధ్యానం చేసినటువంటి నేను ఈ సిద్దుల గుట్టపై ఉన్నటువంటి శక్తి అమోఘమని తెలుసుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ పరమాంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజు గారు మాట్లాడుతూ ధ్యానం చాలా గొప్పదని జ్ఞానం వల్ల అనేక ఉపయోగాలు లాభాలు ఉన్నాయని ప్రతిరోజు ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 1000 మంది ధ్యానులకు వేంపల్లి గ్రామానికి చెందిన తేలు లక్ష్మీ నరసయ్య దంపతులు ధ్యానమృతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ సి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి గారు, అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి , తిరుమల గంగారం, కోనేటి శేఖర్ రెడ్డి, పెంబర్తి నారాయణ, హేమంత్ కుమార్, అమరవాజి శ్రీనివాస్, ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు
