contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

త్వరలో ‘డయల్ యువర్ సీఎం’ ప్రజలముందుకు చంద్రబాబు

అమరావతి : భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్‌కీ బాత్’ రేడియో కార్యక్రమం ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సమస్యలు, విశిష్ట వ్యక్తులు, సందర్భాలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ జనాల్లోకి తీసుకెళుతున్నారు. ‘మన్‌కీ బాత్’ తరహాలోనే సీఎం చంద్రబాబునాయుడు కూడా ప్రత్యేక కార్యక్రమం ద్వారా నేరుగా ఏపీ ప్రజలతో ముఖాముఖీ మాట్లాడబోతున్నారు. ఆడియో, వీడియో రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

ఈ మేరకు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు బుధవారం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ‘డయల్‌ యువర్‌ సీఎం’ ప్రత్యేక కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం, మన్‌ కీ బాత్ కలయికలో ఒక నూతన కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన సిద్ధమవుతున్నారని తెలిసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :