contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ట్రాఫిక్ నియంత్రణ బాగుంటే.. నగరం అభివృద్ధి సాధిస్తుంది: వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్

వరంగల్ : వరంగల్ నగరంలో ట్రాఫిక్ నియం త్రణ బాగుంటే నగరం అభివృద్ధి సా ధించడంతో పాటు, పెట్టుబడులు పెట్టెందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని వరంగల్ పోలీ స్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తెలి పారు. వరంగ ల్ పోలీస్ కమిషనర్ గురు వారం ట్రాఫిక్ అధికారులతో కమిష నరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావే శాన్ని నిర్వహిం చారుఈ సమావే శంలో ముందుగా ట్రి సిటీ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వాటి పనితీరు ప్రధా న జంక్షన్లతో పాటు ట్రాఫిక్ సిబ్బంది. పనితీరుపై పవర్పాయింట్ ప్రజంటే షన్ ద్వారా ట్రాఫిక్ ఏసిపి మధుసూ ధన్ పోలీస్ కమిషనర్ కు వివరించా రు అనంత రం పోలీస్ కమిషనర్ ట్రై సిటీ పరి ధిలో ట్రాఫిక్ నియంత్ర ణకు తీసు కుంటున్న చర్యలను సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఈ సంద ర్భంగా పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, ట్రాఫిక్ అధికారులు నిర్వర్తిం చాల్సించిన విధులు పలు సూచన లు చేసారు. ఇందులో ముఖ్యంగా అనవరస చాలన్లు విధించడం తగ్గి స్తూనే ట్రాఫిక్ నిబంధనలను అతిక్ర మిస్తే జరిమానాలు విధించాలని కేవ లం ద్విచక్ర వాహనదారులపై దృష్టి సా రించకుండా కార్లుతో పాటు ఇతర వాహనాలపై ట్రాఫిక్ అధికారులు దృష్టి పెట్టాలని, త్వరలో స్టాప్ లైన్లు మరియు జీబ్రా లైన్లను ఏర్పాటు చే యబడుతుందని, రాబోవు జనవరి మొదటి తారీకు నుండి స్టాప్ లాన్లు దాటి ముందుకు వస్తే జరిమానాలు విధించాలని, అలాగే ప్రతి కూడళ్ళ లోను ఫ్రీ లెప్ట్ ఏర్పాటు చేయాలని ఫ్రీ టెస్ట్ నిబంధనను అతిక్రమిస్తే జరి మానా తప్పదని, ముఖ్యంగా అధి కారులు సమస్యను అధ్యయానం. చేసి పరిష్కార మార్గాన్ని వెతకాలని, అలాగే జంక్షన్లల్లో ఆటోలు నిలిపి వేయకుండా తగు చర్యలు తీసుకో వడంతో పాటు ఆటో డ్రైవర్ల అడ్డా ల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, వాహన పార్కింగ్ కోసం ప్రధాన రోడ్డు మార్గాల్లో మార్జిన్ లైన్ల ను గీయించి మార్జిన్ లైనులోనే వా హనాలు పార్కింగ్ చేసే విధంగా త గు ప్రచారం చేయాలనిఅలాగే బ్యాం కులు, వైన్ షాపు బార్ల ముందుగా వాహనాల క్రమబద్ధీకరణ చేసేందు కుగా సంబంధితయాజమాన్యం ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసుకోనే విధంగా అధికారులు తెల పాలని, రాబోవు రోజుల్లో ట్రాఫిక్ ఇం జనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇన్స్ స్పెక్టర్ అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యలు రోడ్డు ప్రమాదాల కు గల కారణాలపై విశ్లేషణ చేస్తార ని, త్వరలో హైదరాబాద్ తరహలో నే అపరేషన్ రోప్ నిర్వహింబ డుతు న్నారు ఈ ఆపరేషన్లో భాగంగా నగ రంలో ప్రధాన రహదారుల్లో వాహ నాల రాకపోకలు సజావుగా కొనసా గటానికి, ప్రమాదకరమైన రీతిలో అనుమతించని ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను తరలించడం మోటరు వాహనాలు, చిరు వ్యాపారులు వ్యా పార సంస్థలు రహదారుల ఆక్రమ ణను నిరోధించడమే ఆపరేషన్ రోప్ ప్రధాన ఉద్యేశమని పోలీస్ కమిషన ర్ తెలిపారు.ఈ సమావేశంలో ట్రాఫి క్ ఇంచార్జ్ అదనపు డిసిపి పుష్పా రెడ్డి, ట్రాఫిక్ ఎసిపి మధుసూధన్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్సెస్పెక్టర్లు బాబులాల్ రవికుమార్, రామకృష్ణ, ఆర్.ఐ శేకర్ బాబు, ఇతర ఇన్సెస్పెక్టర్లు. కరుణాకర్, విజయ్ కుమార్, ఎస్.ఐ ఆర్.ఎస్.ఐలు పాల్గోన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :