పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషన్ పాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చెప్పట్టారు .. ప్రభుత్వం వారు తమ కాలనీలోని పాఠశాలను క్లోజ్ చేసి తమ బిడ్డలను మరో పాఠశాలకు పంపిస్తున్నారు. ఇక్కడి నుండి వేరే దగ్గరికి పిల్లలు వెళ్లాలంటే చాల దూరముంటుందని , ఈ విషయం పై ప్రభుత్వం స్పందించడం లేదని చిన్నారుల దల్లిదండ్రులు ధర్నా చేపట్టారు . ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగు న్యాయం చేయాలనీ స్థానికులు కోరుతున్నారు.
