- ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యనందించాలి
- 2,910 పాటశాలలలో గల 1,66,709 మంది విద్యార్ధులకు లబ్ది: జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్
పాడేరు: క్రమశిక్షణతోనే ఉత్తమ విద్యతో బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ హితభోద చేసారు. సోమవారo పాడేరు మండలం కుమ్మరిపుట్టులో గల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాటశాలలో నిర్వహించిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కలక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాటశాలలలో కార్పోరేట్ పాటశాలలకు దీటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించటంతో పాటు శిక్షణ పొందిన ఉత్తమ ఉపాద్యాయులను నియమించతమే కాకుండా విద్యార్ధులకు అవసరమైన విద్యా కిట్లను కూడా అందించటం జరుగుతుoదన్నారు. పిల్లలలో అంతర్లీనంగా ఉన్న శక్తులను గుర్తించి వారి ఇష్టాలను గుర్తించి ఆ విధంగా వారిని తీర్చిదిద్దాలని, నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కలక్టర్ కోరారు. విద్యార్ధులకు ప్రతి రోజూ ముఖ్యమైనదిగా గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, పిల్లలలో జవాబుదారీతనం పెంపొందాలని; తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సరైన సహాయ సహకారాలు ఉండాలని, నాణ్యమైన విద్య అందించటానికి కృషి చేయాలని తద్వారా విద్యార్ధులు ఉన్నతంగా రాణిస్తారని కలక్టర్ విశ్లేశిoచారు. అదేవిధంగా గిరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో ఉపాధ్యాయులపై మరింత భాద్యత ఉందన్నారు. పాడేరు శాసన సభ్యులు కె. భాగ్య లక్ష్మి మాట్లాడుతూ, పాటశాలలు పుణఃప్రారంభం రోజునే విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక పేరుతో పాట్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారంలు, బూట్లు, షాక్స్, డిక్షనరీ తో కూడిన బ్యాగులను పంపిణీ చేయటం గొప్ప విషయమన్నారు. విద్యార్ధులపై, వారి భవితపై ముఖ్యమంత్రికి ఉన్న ఆదరాభిమానాలకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. మన పిల్లలకు కూడా ఆంగ్లంలో ప్రవేశం ఉండాలని, విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచనతో ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశ పెట్టి రెండు భాషలలో పుస్తకాలు ముద్రించి పంపిణీ చేసిన ఘనత జగనన్నదేనని కొనియాడారు. విద్యార్ధులకు ఉత్తమ విద్యతో పాటు నాడు-నేడు క్రింద అన్ని మౌలిక వసతులు కల్పించటం జరుగుతోదన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదవ గలుగుతారని వారికి నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని, పిల్లలు సమాజానికి ఉపయోగ పడే విధంగా, ఈ పోటీ ప్రపంచంలో అందరితో పోటీ పడే విధంగా వారిని తీర్చి దిద్దాల్సిన భాద్యత ఉపాధ్యాయులు స్వీకరించాలని ఎంఎల్ఎ కోరారు. అదేవిధంగా పిల్లలు తమ జీవిత కాలం వారి గురువులను గుర్తుంచుకొనే విధంగా వారిని తీర్చిదిద్దాలన్నారు.
ఈ సందర్భంగా పాతశాలలోని విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కిట్లను అతిధుల చేతుల మీదుగా పంపిణీ చేసారు. జిల్లాలో గల 2,910 పాటశాలలో గల 1,66,709 మంది విద్యార్ధులు ఈ కిట్లను అందుకోనున్నట్లు జిల్లా విధ్యాశాఖాదికారి సలీం భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, స్థానిక సర్పంచ్ సీతమ్మ, ఎంపిపి రత్నకుమారి, ఎంపిటిసి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సూరిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి సలీం బాష, ఎటిడబ్ల్యుఓ రజని, మండల విద్యాశాఖాధికారి, పాటశాల ప్రదానోపాద్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు.