అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించిన సిపిఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 10వ తారీఖున రైతు సంఘం జిల్లా మహాసభను అన్ని మండలాల నుండి పార్టీ కార్యకర్తలు
రైతులు జయప్రదం చేయండిని అన్నారు మహాసభ నిర్వహించు స్థలము ఏబులంలో జరుగుతాయన్నారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా రైతు సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రావు జగ్గారావు,సిపిఐ పార్టీ కార్యదర్శి,అన్ని మండలాల కార్యదర్శులు హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా కార్యవర్గ సభ్యులు
సుంకరి విష్ణుమూర్తి,మండల కార్యదర్శి కంకిపాటి సత్తిబాబు,నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.