ప్రజల హక్కులకు భరోసా ఇచ్చేదే జర్నలిజం అని ప్రముఖ పాత్రికేయుడు ఖాన్ యాజ్దానీ అన్నారు. 77 ఏళ్ల ప్రజాస్వామ్య ఫలవంతంలో జర్నలిజం పాత్ర అనే అంశంపై , ఒంగోలు డివిజన్ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం, ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సదస్సు నిర్వహించారు. ఒంగోలు డివిజన్ అధ్యక్షుడు గద్దల శివాజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి డాక్టర్ చాపల వంశీకృష్ణ పాల్గొని ప్రసంగించారు. సభలో సీనియర్ జర్నలిస్టు కసుకుర్తి మాల్యాద్రి సంతాప్ సూచకంగా మౌనం పాటించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఖాన్ యాజ్దానీ ముఖ్యవక్తగా పాల్గొని రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో జర్నలిస్టులు ముఖ్యపాత్ర వహించాలని సూచించారు.
అధికార పదవుల్లో ఉన్నవాళ్లు ఆధిపత్య మతాలకు సరికాదని అన్నారు. సభా కార్యక్రమానికి తొలుత
డి. జె ఎఫ్ జిల్లా ప్రతినిధి లంకా రాజు స్వాగతం పలుకగా వ్యవస్థాపక కన్వీనర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ డీజే ఎఫ్ చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లు హిందూ ఫోటోగ్రాఫర్ కొమ్ము శ్రీనివాస్ , సాక్షి ఫోటోగ్రాఫర్ ప్రసాద్, షణ్ముఖ వెలుగు ఫోటోగ్రాఫర్ ఉబ్బా అశోక్, ఉదయ అక్షరం ఫోటోగ్రాఫర్ శ్రీనివాసరావు తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో డీజే ఎఫ్ నగర అధ్యక్షలు జీ.శివాజీ, ఉపాధ్యక్షులు ఉబ్బా అశోక్, కోశాధికారి పి. సురేంద్ర, వ్యవస్థాపక అధ్యక్షులు బి. శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పి. సతీష్ , భక్తవత్సలం, నూక తోటి శరత్, ఎస్ ఎన్ పాడు రిపోర్టర్ టీవీ రిపోర్టర్ ఇంజాపల్లి యోహాను , జర్నలిస్టులు , ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.