- హాజరుకానున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
- మండల ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలి.. జడ్పిటిసి పిలుపు
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం గౌడ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గుండ్లపల్లి రాజీవ్ రహదారి నుండి గన్నేరువరం మీదిగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు వేయకుండా రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మండల ప్రజలను ఓట్లు అడగమని అన్నారు. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. 71 కోట్ల నిధులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ సహకారంతో మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఈ పనులు ఈ నెల 6వ తేదీన ఘనంగా ప్రారంభోత్సవం చేయనున్నారని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం రోడ్డు సమస్యను చూపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. 9 సంవత్సరాల నుండి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవిస్తున్నమని అన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో గన్నేరువరం మండలం లోని గ్రామాలను ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలుపుతమన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గుడెల్లి తిరుపతి ,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న , వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు , ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూర వెంకటేశ్వర్,వివిధ గ్రామాల సర్పంచులు పీచు చంద్ర రెడ్డి , కుమ్మరి సంపత్, ఆటికం శారద శ్రీనివాస్ , మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూన చంద్రశేఖర్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నక్క దామోదర్, మాల మహానాడు మండల అధ్యక్షుడు హనుమండ్ల మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్, నాయకులు బోయిని కుమార్, అట్టికం రవి, వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు మరియు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.