- మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు
- యువతకు కారంపూడి సిఐ దార్ల జయకుమార్ , ఎస్ఐ ఎం. రామాంజనేయులు సూచన
పల్నాడు జిల్లా కారంపూడి: యువత మదక ద్రవ్యలకు ముఖ్యంగా మత్తు పదార్దాలకు బానిసై వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని కారంపూడి సిఐ దార్ల. జయకుమార్, ఎస్ఐ ఎం. రామాంజనేయులు యువతను కోరారు. సోమవారం మదక ద్రవ్యల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కారంపూడి సిఐ దార్ల. జయకుమార్, ఎస్ఐ ఎం. రామాంజనేయులు మాట్లాడుతూ యువత చెడు వ్యాసనలకు బానిసలుగా మారితే ఆయా కుటుంబాలు ఎంతగానో నష్టపోతాయని మత్తు పదార్దాలకు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని ఈ విషయాన్ని యువత గ్రహించాలని వారు కోరారు. మత్తు పదార్దాలకు బానిసలుగా మారటం వలన అనుకోని గొడవలు ఘర్షణలకు దారితీసి నేరస్తులుగా మరే అవకాశం ఉందని అంతేకాకుండా మత్తు పదార్దాలు సేవించి వాహనాలు నడపటం వలన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని కావున యువత మత్తుకు దూరంగా ఉండాలని వారు సూచించారు. తల్లితండ్రులు కూడా పిల్లల విషయంలో తాగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పిల్లల అలవాట్ల పై వారి దినచర్యల పై నిగ ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమనికి ముందుగా పాఠశాల విద్యార్థులతో కలిసి మత్తు పదార్దాలకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మనవహారం నిర్వహించి మత్తు పదార్దాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ షేక్. షఫీ, పాఠశాల విద్య కమిటీ చైర్మన్ ఆతుకూరి. గోపి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రఘుబాబు, పంచాయతీ వార్డు సభ్యులు కిల్లా. కాశీ, ఏ ఎస్ఐ శేఖర్, పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.