సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ధోనే అశోక్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మహాజన్ సంపర్క్ అభినయలో భాగంగా ఐదు, తొమ్మిదో వార్డులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పరిపాలనలో చేసిన సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమును ప్రజలకు వివరించడంజరిగింది. 9 సంవత్సరాల పరిపాలనలో అంత్యోదయ స్ఫూర్తితో దేశంలోని అట్టడుగు ప్రజలకు గరీబ్ కళ్యాణ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి కిషన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6000 పెట్టుబడి సహాయం అందించడం జరుగుతుంది. ఎల్పిజి కలెక్షన్లు, కెన్ ఔషధీ కేంద్రాలలో సరసమైన ధరలకు నిరుపేదలకు మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలో దారిద్ర రేఖ దిగువగా ఉన్నటువంటి ప్రజలను ఆదుకొని భారతదేశాన్ని వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దొంతర వేణి శ్రీనివాస్, బిజెపి మండల ఉపాధ్యక్షులు గైని రాజు, బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బండిపెల్లి సత్యనారాయణ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వరుణ్ రావు, బెజ్జంకి పట్టణ అధ్యక్షులు సంఘ రవి, సీనియర్ నాయకులు కొండల వెంకటేశం, కిషన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు రాచకొండ శ్రీధర్ రావు, బిజెపి బూత్ అధ్యక్షులు గొడుగు సంపత్ తదితరులు
పాల్గొన్నారు.