మాచర్ల పురపాలక సంఘ పరిధిలో తేదీ:21-07-2023 నుండి జరుగుచున్న బి.ఎల్. ఓ.లు చేయుచున్న ఓటర్ల జాబితా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ను తనిఖీ చేయడమైనది. బూత్ నెంబర్లు 61,65,80,89 మరియు 90 లలో తనిఖీలు నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేయడమైనది. ఓటర్ల జాబితా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ నందు వార్డు వాలెంటీర్లు ఎవరూ పాల్గొనకూడదని గతంలోనే ఆదేశాలు జారీ చేయడమైనది. ఎలక్షన్ బూత్ ల తనిఖీలో కూడా వార్డు వాలెంటీర్లు ఎవరూ పాల్గొనకపోవుట గమనించడమైనది.