- దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రయాణించు అన్ని వాహన దారులకు
- ప్రకాశం పోలీస్ మరియు అటవీశాఖ వారి హెచ్చరిక .
- దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రయాణించు వాహనదారులు, నిర్ణిత సమయంలోనే ప్రయాణించవలయును.
దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రయాణించు వాహనదారులు, వన్య ప్రాణుల సంరక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణ నిమిత్తం గంటకు 30 కిలో మీటర్ల వేగం కంటే ఎక్కువ వేగం ప్రయాణించరాదు, నిర్ణీత వేగం కంటే ఎక్కువ వేగం ప్రయాణించు వాహన దారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోనబడును.
శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్దనుండి దోర్నాల లోని గణపతి చెక్ పోస్ట్ వద్దకు, 1 గంట సమయం కంటే ముందుగా వచ్చే వాహనదారులను ఓవర్ స్పీడ్ గా పరిగణించి, వారికి 500 రూపాయలు జరిమానా విధించబడును.
కార్లలో ప్రయాణించు వాహనదారులు విధిగా, సీట్ బెల్ట్ ధరించవలయును, సీట్ బెల్ట్ ధరించని యెడల చట్ట పరమైన చర్యలు తీసుకొనబడును.
టూ వీలర్ పై ప్రయాణించు వారు తప్పకుండా హెల్మెట్ ధరించవలయును. హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా మరియు చట్ట పరమైన చర్యలు తీసుకొనబడును.
టూ వీలర్ పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించ రాదు. ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణించిన వాహనదారులపై చట్ట పరమైన చర్యలు తీసుకొనబడును.
దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్ లో నిషేధించ బడిన వాహనములు, ఘాట్ రోడ్ లో ప్రవేశించ రాదు.
నిబంధలు ఉల్లఘించిన వాహనదారులకు జరిమానా విధించారు. ఈ తనిఖీలో వై.పాలెం సిఐ మారుతీ కృష్ణ, దోర్నాల ఎస్సై శ్రీనివాస రావు, అటవీశాఖ అధికారి విశ్వేశ్వర రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.