అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కేంద్రంలో మురుకి నీరు కాలువ చెత్త చెదారంతో నింది పోయింది. కల్వర్టు మూసుకు పోవడంతో
మురుగు నీరు వర్షపు నీరు కలిపి పోవడానికి ఒకటే ప్రధాన డ్రైనేజీ వుంది. కిలోమీటరు పొడవు నిర్మించిన ఈ డ్రైనేజీకి ఒక్కాగాని ఒక్క డైవర్షన్ కల్వర్టు బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద నిర్మించారు, అది కూడా పుడుకు పూరికిపోయింది. మోదకొండమ్మ తల్డి గుడి నుండి ప్రభుత్వ పాఠశాల వరకు నిర్మించిన డ్రైనేజీకి పైకప్పు లేకపోవడంతో పూర్తిగా చెత్త చడారంతో పేరుకు పోయింది. దీంతో కొద్దిపాటి వర్షం వచ్చినా వర్షపునీరు ప్రధాన రహదారిపై ఏరులై ప్రవహిస్తుంది, వీటిపై కనీసం పట్టించుకున్న పాపన పోలేదు పంచాయితీ అధికారులు. మండల కేంద్రం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వాహన చోదకులు,పాదచారులు రాక పోకలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంమే ఇలా వుంటే ఇక మారుమూల గ్రామాల పరస్థితి ఇంకెలా వుంటుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే రోడ్డుపై పారే వర్షపు నీరు నేరుగా బాలికల వసతి గృహంలో చేరి చెరువులను తలపిస్తున్నాయి. కొట్టుకొచ్చిన చెత్త చెదారం వసతి గృహం అవరణలో పేరుకు పోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కాగా వీటితో విద్యార్దులు విషజ్వారాల బారిన పడే ప్రమాదము లేకపోలేదు. ఇకనైనా అధికారులు స్పందిస్తారో లేదా వేచి చూడాలి.