అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎదురుగా గల పెద్ద కాలువల నందు దుకాణదారులు విపరీతమైన వ్యర్థాలను వేయడం వల్ల మురుగునీరు సాఫీగా పోవడానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.కావున దయచేసి చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరుచేసి మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన వాహనాలలో పడివేయాలని వైయస్సార్సీపి పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది శేఖరు, రాజేశ్వర్లు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.