కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో వేసేవిలో తాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై మండల ప్రత్యేక అధికారి రామానుజాచారి అధ్యక్షతన మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం
లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గునుకుల కొండాపూర్ లో బావి పనులను, మండల కేంద్రం గన్నేరువరంలో పైప్ లైన్ పనులను, చీమలకుంటపల్లెలో అద్దెకు తీసుకున్న బావిని పరిశీలించారు. వేసవికాలంలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా పాత బావులు బోరు పంపులు సింగల్ ఫేస్ మోటార్లను మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఎంపీడీఓ తీగల శంకర్, ఎంపీఓ పీవీ నర్సింహారెడ్డి,గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.