- గుక్కెడు మంచినీళ్లు దొరక్క గేటువలస వాసులు ఇక్కట్లు.
- ఏమి పట్టని పాలకులు, అధికారులు.
అల్లూరి జిల్లా, అనంతగిరి : అనంతగిరి మండలంలో గల బొర్రా గేటు వలస గ్రామంలో నిత్యం మంచినీటి సమస్యతో విల విల లాడుతున్నారు. గుక్కెడు మంచినీళ్లు దొరక్క గ్రామస్తులు ప్రతినిత్యం ఆందోళన చెందుతున్న పట్టించుకునే నాధులే కరువయ్యారు. ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సమస్యను విన్నవించిన తూతూ మంత్రంగా వ్యవహరించి సమస్యను అట్టహాసంగా వదిలి వేస్తున్నారు.దింతో గ్రామంలో మంచినీళ్లు దొరక్క బిందెలు పట్టుకొని కుళాయి వద్ద మహిళలు కాచి వేచి చూస్తున్నారు. సోమవారం నాడు స్థానిక వైసిపి నాయకులు దానియేలు, బాబురావు మాట్లాడుతూ… గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేక అనేక సమస్యలు ఎదురవు తున్నాయని, నిత్యం మంచినీటి సమస్యలు నిలువెల్ల తయారైం దని మండల అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చి విన్నవించిన,పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా గేటు వలస గ్రామంలో త్రాగునీటి సమస్య పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి త్రాగు నీటిని అందుబాటులో తీసుకొని రాకుంటే మహిళలతో మండల కార్యాలయానికి వచ్చి సమస్యను ఉద్రిక్తం చేస్తామని డిమాండ్ చేశారు.