- రోగుల ప్రాణాలతో వైద్యుల చెలగాటం..
- కాలం చెల్లిన మందులు ఇస్తున్న వైనం బయటపడింది.
- సిబ్బంది అందుబాటులో ఉండరు
- డాక్టర్లు అసలే కనబడరు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ వై . యస్ . ఆర్ ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాలంచెల్లిన మందులు, ఇంజక్షన్లను రోగులకు ఇస్తున్న వైనం బయటపడింది. ఈ మధ్య కాలంలోనే నాసిరకం కట్టడాలతో కట్టిన ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. పేరుకు మాత్రమే ఆసుపత్రి, ఒక ప్రక్క నాసి రకం కట్టడం, మరో ప్రక్క కాలం చెల్లిన మందులు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకోవడం
ప్రభుత్వ వైద్య సిబ్బందికి పరిపాటైపోయింది. కాలం చెల్లిన మందుల పైన కొత్తగా స్టిక్కర్లు అంటించి, సరఫరా చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన మందులులను బాత్ రూమ్, మూత్ర విసర్జన గదులలో ఎవరికి కనబడకుండా దాచిపెట్టి వాటినే రోగులకు ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సిపిఐ నాయకుడు కృష్ణా నాయక్ ఆవేదన వ్యక్తం చేసారు. డాక్టర్లు గాని, వైద్య సిబ్బంది గాని రోగులకు అందుబాటులో ఉండరు. దీని వెనుక పెద్ద స్కామ్ జరిగి ఉంటుందని, కాలం చెల్లిన మందులతో రోగుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసి కూడా ఇలా కాలం చెల్లిన మందులను రోగులకు ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ డ్రగ్ మాఫియా పై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పిడుగురాళ్ళ ప్రైమ్ హెల్త్ సెంటర్ లో నాసిరకం పనులు – పట్టించుకోని అధికారులు