డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు చిత్రవిచిత్ర సమాధానాలు చెబుతుంటారు. ఇదే తరహాలో ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోయి వింత సమాధానం చెప్పాడు. మేడ్చల్-కండ్లకోయలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు ఏం తాగావు అని ప్రశ్నించగా పాలు తాగాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.