పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో జీప్ .. బైక్ ని ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి . వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి సుమారు 7 .30 గంటల ప్రాతం లో వేగంగా వెళ్తున్న జీప్ బైక్ పై దూసుకెళ్లడం తో బెల్లం కొండా సాయి( 23 ) అనే యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం సేవించి నడిపినట్టు మృతుని కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. న్యాయం చేయాలంటూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. వైసిపి నాయకుడి కుమారుడు అవడంతో పోలీసులు కేసును జాప్యం చేస్తున్నారంటూ ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చెర్యలు తీసుకోవాలంటూ బాధితుని కుంటుంబ సభ్యులు కోరుతున్నారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసినట్టు నిందితుడు పరారీలో ఉన్నాడని సమాచారం . ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.