contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డీఎస్పీని కానిస్టేబుల్ గా డిమోట్ చేసిన యూపీ సర్కారు.. మరి తెలుగు రాష్ట్రాలలో ?

ద్యోగం మాత్రమే పెద్దది.. బుద్ధులు మాత్రం చిన్నవే.. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సదరు ఉన్నతాధికారిని చిన్న పోస్టుకు డిమోట్ చేసింది. ఏకంగా డీఎస్పీ ర్యాంకు నుంచి కానిస్టేబుల్ ర్యాంకుకు దిగజారాడా ఉద్యోగి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన మాజీ డీఎస్పీ కృపా శంకర్ కనౌజియా మూడేళ్ల కిందట ఓ మహిళా కానిస్టేబుల్ తో హోటల్ లో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో శాఖాపరమైన విచారణ జరిపించిన పోలీస్ శాఖ.. తాజాగా కృపా శంకర్ ను కానిస్టేబుల్ ర్యాంకుకు డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయం పై స్పందించిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్, జాతీయ అధ్యక్షులు వి. సుధాకర్, తెలుగు రాష్ట్రాలలో లంచగొండి అధికారుల పై ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుటుందని అన్నారు. తన సలహాలు సూచనలు, కేంద్రం మరియు ఇతర రాష్ట్రాల లో ఉన్న పరభుత్వాలు అమలు పరుస్తున్నాయి కానీ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. గతంలో తాను కేంద్ర ప్రభుత్వాని లంచకోండి అధికారుల విషయంలో, పోలీసు అధికారుల వ్యవహారంపై వారిని సస్పెండ్ చేయడం కంటే అదే పోలీస్ స్టేషన్ లో ప్రజల సమక్షంలో కోర్టు మార్షల్ చేయాలని, లేదా డెమోట్ చేయాలి, లేదా కాశ్మీర్ బార్డర్ లో ఆరు నెలల పాటు పనిష్మెంట్ డ్యూటీలు వేయాలి అప్పుడే అధికారులతో మార్పు వస్తుందన్నారు.

ఇకనైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంతృలు లంచగొండి అధికారుల పై వేటు వేయాలంటే వారిని సస్పెండ్ చేయడం కన్నా పనిష్మెంట్ ఇవ్వడం మంచిదని, దానివలన ప్రమోషన్ ఆగిపోతుంది. ఇంక్రిమెంట్ కూడా కట్ అవుతుందన్నారు. దాని వలన అధికారులలో మార్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, చిన్నా పెద్దా తేడా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా సమయంలో పోలీసుల వ్యవహారం పై వి. సుధాకర్ ఘాటుగా స్పందిస్తూ కేంద్ర పరభుత్వానికి వినతులు పంపించడం జరిగిందన్నారు. అంతేకాక తానూ కూడా ప్రజా సమస్యల పై స్పందిస్తూ కొంతమేరకు ఉన్నతధికారులతో మాట్లాడి పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. ఉదాహరణకు వరంగల్ జిల్లా కారంలో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సామాన్యుడిని వేముకలు విరిగేటట్టు అంటే పక్కటెముకలు విరిగేటట్టు కొట్టి హింసించాడు. ఆ కేస్ ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూసారు. ఇలా చెప్పుకుంటూ పొతే అనేక సమస్యలు తన ద్వారా పరిషరించబడ్డాయన్నారు. కొందరు జర్నలిస్టులు అయితే చిన్న పని చేసి దాన్ని ఊరంతా చూపించుకుంటారు. కానీ తనని నమ్మి వచ్చిన వారికి మాత్రం సహాయం చేసినా పబ్లిసిటీ కి దూరంగా ఉంటారు. నిజమైన జర్నలిజం, నిజాయితీ గ పని చేసే జర్నలిస్టులు అంటే ఇలానే ఉంటారేమో … ! పబ్లిసిటీ కోరుకోరు .. పబ్లిసిటీ కి దూరంగా ఉంటారు.

అసలేం జరిగిందంటే..
2021లో డీఎస్పీ కృపా శంకర్ ఆఫీసుకు లీవ్ పెట్టి ఎటో వెళ్లిపోయాడు. అసలే కరోనా కాలం.. ఆపై భర్త కనిపించకపోవడంతో కృపా శంకర్ భార్య ఆందోళన చెందింది. వెంటనే ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్.. సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా కృపా శంకర్ ను వెతుక్కుంటూ వెళ్లారు. చివరకు ఓ హోటల్ లో కృపా శంకర్ ఉన్నట్లు గుర్తించి ఆయన భార్యతో సహా వెళ్లి తలుపుతట్టారు. లోపల ఓ మహిళా కానిస్టేబుల్ తో రొమాన్స్ చేస్తూ కృపా శంకర్ దొరికిపోయాడు. భర్త నిర్వాకం కళ్లారా చూసిన భార్య షాక్ కు గురైంది. ఇటు ఓ ఉన్నతాధికారి, అటేమో డిపార్ట్ మెంట్ కు చెందిన చిరుద్యోగి కావడంతో పోలీస్ శాఖ అంతర్గత విచారణ జరిపించింది. ఇద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. డీఎస్పీ కృపా శంకర్ ను కానిస్టేబుల్ ర్యాంకుకు డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :