రంజాన్ మాసం సందర్భంగా గౌస్ ఏ అజమ్ వెల్ఫెర్ సొసైటీ ఆధ్వర్యంలో చీరలు, పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై చీరలు పంపిణీ చేశారు..
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌస్ ఏ అజమ్ వెల్ఫెర్ సొసైటీ అధ్యక్షుడు ముక్తార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రంజాన్ మాసం సందర్భంగా చీరలు, మగ్ జ్యుద్, సేమియాలు పంపిణీ చేస్తున్నారు, ఇంక ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు,వారికి అల్లాహ్ దివనలు ఎల్లపుడూ ఉండాలని, సొసైటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్ షేక్.అస్మా యూసుఫ్, రాయలింగు, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ముక్తార్ ఖాద్రీ, కో ఆప్షన్ సభ్యుడు వాజిద్, ప్రజాప్రతినిధులు, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, నాయకులు శ్రీధర్, మైనారిటీ నాయకులు అలీ, ఇజాజ్, ఖలీల్, యునీస్, తదితరులు పాల్గొన్నారు …