మంగళగిరి: రత్నాల చెరువులో డ్వాక్రా ఆర్పీ మృతి చెందింది. స్థానిక డ్వాక్రా గ్రూపులకు ఆర్పిగ వ్యవహరిస్తున్న శ్యామల అనే మహిళ మృతికి మంగళగిరి మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం మెప్మా సిఎంఎం వేధింపులే కారణం అంటు డ్వాక్రా సంఘాల ఆరోపిస్తున్నాయి.
సిఎంఎం నాగేంద్ర ఆర్పీ శ్యామలను అసభ్యకర పదజాలంతో దూషించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె సిఎంఎం నాగేంద్రపై అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన ఫలితం లేక చనిపోయినట్లు డ్వాక్రా సంఘాల సభ్యులు బలంగా ఆరోపిస్తున్నారు. డ్వాక్రా మహిళలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సిఎంఎం నాగేంద్ర పై చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.