ఆంధ్రప్రదేశ్ : గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్)ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈగల్ చీఫ్ గా ఆకే రవికృష్ణను నియమించారు.
మీడియాతో రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా నేరమేనని చెప్పారు. డ్రగ్స్, గంజాయి నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) చట్టం ఎంత కఠినమైనదో అందరికీ తెలియాలని చెప్పారు.
ఈ కేసుల్లో దోషులుగా తేలితే ఏడాది నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు ఉన్నాయని తెలిపారు. రూ. 2 లక్షలకు పైగా జరిమానా విధించే అవకాశముందని చెప్పారు. ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతడికి చాలా నష్టం జరుగుతుందని అన్నారు.