- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ ఐశ్వర్య రస్తోగి, IPS
ఈ రోజు అనగా 03.04.2022 తేదీన ఉదయం కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గా నియమితులైన శ్రీ ఐశ్వర్య రస్తోగి, IPS., వారు పదవీ బాధ్యతలను స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ఎస్పీగా నియమితులై ఈరోజు ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలను చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాసం రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు గారికి, రాష్ట్ర గౌరవ డిజిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ… కొత్తగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లా పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని. మహిళల మరియు చిన్నారులు భద్రత అనేది మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలపై దృష్తి సారించి వాటిని అరికట్టేలా చూస్తామని తెలియపరుచినారు. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తాం అని తెలియచేసారు. నూతనంగా కలసిన ప్రతి మండలంలో గత 05 సంవత్సరాలలో జరిగిన క్రైమ్ ప్యాటర్న్ పై ఒక ప్రణాళిక సిద్దం చేసి అక్కడ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం అని తెలియపరుచినారు. ఆస్తి నేరాలు, శారిరిక నేరాలపై (Bodily Offences), మరియు సార నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియపరుచినారు. అలాగే కొత్తగా నూతన జిల్లలో కలసిన నేషనల్ హైవే పై జరిగే నేరాలు, ప్రమాదాల నివారణకు ప్రత్యేక పోలీసు పెట్రోల్లింగ్ ఏర్పాటు చేస్తామని తెలియపరుచినారు.