పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సెంట్ పాల్ లూథరన్ చర్చి పాస్టర్ డాక్టర్ రెవరెండ్ మాణిక్యాలరావు ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసు పునర్జన్మ గురించి క్లుప్తంగా వివరించారు. చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.
లోక రక్షకుడు యేసుక్రీస్తు శిలువలో మరణించి మూడవ రోజున తిరిగి లేచిన దినాన్ని పురస్కరించుకొని ఆదివారం యేసు పునరుత్తాన దినాన్ని క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల చర్చిల్లో ఉదయం 4 గంటలకే కొవ్వొత్తులు వెలిగించి ఇండ్ల వద్ద నుండి మనయేసు లేచెను, మనకెంతో ఆనందం అంటూ కీర్తనలు పాడుచూ చర్చిల్లోకి వెళ్లి స్తుతించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.