వీవీ ప్యాట్ల వినియోగానికి అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లాంఛనంగా ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈవీఎంల వినియోగానికి అనుమతించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ఏ ప్రకారం ఓటింగ్ మెషీన్లకు అనుమతి నిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల డిజైన్లను ఆమోదించినట్టు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఈసారి ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ జరగనుండగా, చివరిదైన ఏడో విడత జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.