న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (Nama nageshwar rao)కు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate) ప్రకటించింది.ఎంపీ నామా (TRS MP)కు చెందిన రూ.80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న రూ.361.29 కోట్లను దారి మళ్ళించినట్లుగా ఈడీ కేసు నమోదు చేసింది.