హైకోర్టు ఆదేశాల మేరకే ఇసుక తవ్వకాల తరలింపు పై వస్తున్న ఫిర్యాదులు నేపథ్యంతో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత ఆదివారం జిల్లాలోని వివిధ ఇసుక రీచ్ లను ఆకస్మిక తనిఖీలు చేశారు..
మధ్యాహ్నం నుండి క్షేత్రస్థాయిలో జిల్లాలోని కడియం పెరవలి నిడదవోలు, కొవ్వూరు మండలాల్లో ఇసుక రీచ్ లను ఆమె జిల్లా అధికారుల జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ,ఆర్డిఓ ఏ చైత్ర వర్షిని, మైన్స్ ఏడి ఎమ్ సుబ్రహ్మణ్యం, సెబి అధికారి వి సోమశేఖర్, గ్రౌండ్ వాటర్ డిడి వై.శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, ఇరిగేషన్ అధికారి ఆర్ కాశి విశ్వేశ్వరరావు తో కలిసి పరిశీలించారు.