contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమల్లోకి ఎన్నికల కోడ్ .. పార్టీలు ఏం చేయకూడదో తెలుసా ?

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. భారత ఎన్నికల కమిషన్ నిన్న మధ్యాహ్నం షెడ్యూల్‌ను విడుదల చేసింది. చత్తీస్‌గఢ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మిజోరంలో నవంబరు 7న ఒకే విడతలో ఎన్నికలు పూర్తికానుండగా, చత్తీస్‌గఢ్‌లో అదే నెల 7, 17 తేదీల్లో రెండు విడతలుగా జరుగుతాయి. మధ్యప్రదేశ్‌లో 17న, రాజస్థాన్‌లో 23న పోలింగ్ జరగనుండగా, తెలంగాణలో 30న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడిస్తారు. షెడ్యూల్ ప్రకటనతోనే ఈ ఐదు రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.

ఈ కోడ్‌లో రాజకీయ పార్టీలు ఏం చేయకూడదో చూద్దాం.

  •  ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ అధికార పార్టీ నేతలను కానీ, మంత్రులను కానీ వారి ఇంటి వద్ద వ్యక్తిగతంగా కలవకూడదు.
  •  ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కానీ, పార్టీ నేత కానీ తమ ఇంటి వద్ద కార్యక్రమాలు నిర్వహించకూడదు. అయితే, తమ సొంత ఖర్చుతో మాత్రం చేసుకోవచ్చు.
  •  ఏదైనా పథకం కానీ, ప్రాజెక్టుకు కానీ కోడ్ అమల్లోకి రావడానికి ముందే గ్రీన్ సిగ్నల్ లభించి, క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కాకపోతే, కోడ్ అమల్లోకి వచ్చాక ఆ పని ప్రారంభించడానికి వీల్లేదు.
  •  అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు.
  •  ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ తమ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకూడదు.
  •  కోడ్ అమల్లోకి వచ్చాక పెన్షన్ ఫాంలు స్వీకరించడం, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, బీపీఎల్ కుటుంబాలు ఎల్లో కార్డులు జారీ చేయడం నిషేధం.
  •  ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు.
  •  టెండర్లు జారీ చేయడం కానీ, కొత్త పనులు ప్రారంభించడం కానీ ప్రభుత్వం చేయకూడదు.
  •  కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు ప్రారంభించడం, పెద్ద భవనాలకు క్లియరెన్స్ ఇవ్వడం నిషేదం.
  • ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది.

Bourge Mens Loire-z1 Running Shoes

Bourge Mens Loire-z1 Running Shoes

Deal Price : ₹329 – M.R.P.: ₹1,499
https://amzn.to/3thIpLd

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :