గన్నేరువరం మండల కేంద్రంలోని రేపు ఉపకేంద్ర అవరణంలో విద్యుత్ వినియోగదారు లోకల్ కోర్టు ఏర్పర్చినట్లు తెలంగాణ ఎన్పిడిసిఎల్ గన్నేరువరం ఏఈ ఆంజనేయులు తెలిపారు. ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునర్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చటం, వోల్టేజీ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెంపుదల, లోపాలు ఉన్న మీటర్లు, మార్చడం, నూతన సర్వీసులు మంజూరు, అదనాపు లోడు క్రమబద్ధీకరణ, సర్వీస్ పేరు మార్పు వాడు కానుకన్నా హెచ్చ మొత్తములో గల బిల్లులు, కటగిరి మార్పు, సర్వీస్ రద్దు మొదలగు వాటికి సంబంధించి విద్యుత్ వినియోగదారులు వ్రాతపూర్వకంగా తమ ఫిర్యాదులు అందించవచ్చు అని తెలిపారు. ఈ ఫిర్యాదులు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరించబడునని అన్నారు. కావున టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినించుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.