కరీంనగర్ జిల్లా: కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర నిర్వహించారు.శుక్రవారం కరీంనగర్ నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీమేనేని రోహిత్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, గౌడ కుల బంధువులు ఆయనకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గౌడ కుల బంధువులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.