ఏలూరు జిల్లా నూజివీడు మండలం మోర్సపూడి గ్రామంలో మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించిన వార్డు మెంబర్ ఆంజనేయులు. తన స్థలంలో గడ్డిని గొర్రెలు తిన్నాయనే కారణంతో ముగ్గురు మహిళలను కర్రతో చితకబాదాడు. తన స్థలంలో కాదు పక్కనే ఉన్న సచివాలయం స్థలంలో గొర్రెలు తిన్నాయి అని చెప్పినా వినిపించుకోకుండా అతి దారుణంగా దాడికి దిగాడు. దాడిలో గాయపడిన ముగ్గురు మహిళలను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.