కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు: కాలే కడుపులతోనే విద్యార్థులు విద్యను వెళ్లదీస్తున్నారు. దీంతో పేద విద్యార్థుల చదువలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎక్కువశాతం మంది నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్నవారే. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలే ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలను చేర్పిస్తున్నారు. ఆకలితో అలమటిస్తూ విద్యార్థులు పాఠ్యాంశాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు నీరస పాడిపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కస్తూరిబా పాఠశాలలో గత కొన్ని రోజులుగా పాఠశాలలో వంట సిబ్బంది మధ్య గొడవలు జరుగుతుందటంతో అక్కడ వంట సరిగ్గ చేయడం లేదని, నిన్నటి రోజు రాత్రి విద్యార్థులకు అన్నం పెట్టలేదని, ఉదయం టిఫిన్ కూడా లేటుగా పెట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రిన్సిపాల్ కి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.