దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాచని సోమప్ప స్కూల్ లో NCC విద్యార్థులు ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో వీరమరణం పొందిన వారికీ కోవొత్తులు వెలిగించి నివాళులు అర్పించి, పట్టణంలో ర్యాలీ చేపట్టారు.అనంతరం NCC విద్యార్థులు మాట్లాడుతూ దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ సైనికులకు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపింది. ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి పాకిస్థాన్ చొరబాటుదారులపై యుద్ధభేరి మోగించి, 1999లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ప్రతిఘటన యుద్ధానికి దారి తీసింది. ఎట్టకేలకు పాకిస్థాన్ ఆక్రమించుకున్న మన పర్వత శిఖరాలను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ఈ విజయానికి ప్రతీకగా ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ గా నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు వివరించారు.