కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై సెబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరిధిలో ఉన్న కల్లూదేవకుంట గ్రామ సమీపంలో ఒక కారులో 37 బాక్స్ ల కర్ణాటక మద్యం, మాధవరం చెక్ పోస్ట్ దగ్గర ఒ ఆటోలో తరలిస్తున్న 18 బాక్స్ ల కర్ణాటక మద్యం ను ఎమ్మిగనూరు సెబ్ పోలీసులు పక్క సమాచారంతో పట్టుకున్నారు.వీటి విలువ సుమారు మూడు లక్షల రూపాయలుగా ఉంటుందని, ఎనిమిది మంది నిందుతులను అరెస్ట్ చేసి నట్టు ఎమ్మిగనూరు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు.
ఈ దాడులలో ఎమ్మిగనూరు SEB CI P. భార్గవ రెడ్డి, ఎమ్మిగనూరు SEB SI సత్యనారాయణ, కోసిగి SEB SI రమేష్ బాబు మరియు కానిస్టేబుల్ మధు, మాధవరం చెక్ పోస్ట్ SEB SI రాజశేఖర్, మాధవరం చెక్ పోస్ట్ కానిస్టేబుల్స్ అయ్యన్న, ఎమ్మిగనూరు హెడ్ కానిస్టేబుల్స్, P.రబ్బాని, V. లింగ ప్రసాద్, ఎమ్మిగనూరు కానిస్టేబుల్స్ భరత్, నరసింహ రెడ్డి, రాధమ్మ మరియు లక్ష్మన్నలు పాల్గొన్నారు.