కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బి.సుదర్శన్ రెడ్డి ఉద్యోగ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అ క్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు.