- మాచర్ల నియోజకవర్గన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న పిన్నెల్లి సోదరుల పై ఈనాడు లో విషపు రాతలా…
- మాచర్లలో అటవిక రాజ్యమైతే ప్రజలు పిన్నెల్లి ని నాలుగు సార్లు ఎలా గెలిపించారు
- తప్పుడు రాతలు వ్రాసిన ఈనాడు రామోజీరావు ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డికి నియోజకవర్గ ప్రజలకు క్షమపణ చెప్పాలి
- ఈనాడు కధనం పై కన్నెర్ర చేసిన కారంపూడి వైసీపీ నాయకులు
- తప్పుడు రాతలు వ్రాసిన ఈనాడుకు వ్యతిరేకంగా నాగులేరు పై ధర్నా
- ఈనాడు పత్రికను తగలపెట్టిన వైసీపీ నాయకులు
మాచర్ల నియోజకవర్గన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి, ఆయన సోదరుడు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి పై ఈనాడు దినపత్రిక విషపు రాతలు వ్రాసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారంపూడి మండల నాయకులు ఈనాడు కధనానికి స్థానిక నాగులేరు బ్రిడ్జి పై శుక్రవారం ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గంలో అటవిక రాజ్యం కొనసాగుతుందని ఈనాడు కధనాన్ని ప్రచురించిందని ఇలాంటి తప్పుడు వ్రాతలు రాయటం వలన పేపర్ పరువే పోతుందని నిజంగా మాచర్ల నియోజకవర్గంలో అటవిక రాజ్యం సాగితే నియోజకవర్గ ప్రజలు నాలుగు సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ని ఎలా గెలించుకుంటారని వారు అన్నారు. మాచర్ల నియోజకవర్గ చరిత్రను పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి తిరగరాసి 2009 నుండి వరుసగా విజయం సాధించారాని తప్పుడు రాతలు వ్రాస్తున్న ఈనాడు సంస్థ యాజమాన్యం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి అలాగే నియోజకవర్గ ప్రజలకు ఈనాడు రామోజీరావు క్షమాపణ చెప్పాలని ఈ సందర్బంగా వైసీపీ నాయకులు డిమాండ్ చేసారు. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దిక్కుమొక్కు లేక టీడీపీ పార్టీ పూర్తిగా మనుగడ కోల్పోయిందని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అయన సోదరుడు చేస్తున్న అభివృద్ధి పనులకు ఈ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మెగ్గు చూపుతున్నారని మళ్ళీ నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి విజయం ఖాయమని ఇది గమనించిన టీడీపీ నాయకులు నియోజకవర్గంలో ఏదొక అలజడి సృష్టించలన్న ఉద్దేశంతో ఎల్లో పత్రిక అయినా ఈనాడు ద్వారా విషపు రాతలు వ్రాయిస్తున్నారని వాటిని ప్రజలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ నాయకులు సూచించారు. టీడీపీ నాయకులు ఎల్లో పత్రిక యాజమాన్యం ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ని ఎదురుకోలేక ఈనాడు ద్వారా విషప్రచారం చేస్తున్నారని ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ వారికీ ఎల్లో మీడియాకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్తారని వైసీపీ నాయకులు తెలిపారు. అనంతరం రామోజీరావు డౌన్ డౌన్ అంటూ వైసీపీ నాయకులు నినాదాలు చేసి అబద్దపు రాతలు వ్రాసిన ఈనాడు పత్రిక ప్రతులను ఈ సందర్బంగా వైసీపీ నాయకులు నాగులేరు బ్రిడ్జి పై తగలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్. అక్బర్ జానీ భాషా, జడ్పీటీసి షేక్. షఫీ, పాతూరి. రామిరెడ్డి, కొమ్ము. చంద్రశేఖర్, చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, కొంగర. సుబ్రహ్మణ్యం, బొమ్మిన. అల్లయ్య, కోఆప్షన్ సభ్యులు అంతరగడ్డ. ఏసోబు, కారంపూడి సర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్, ఆశం. విజయభాస్కర్ రెడ్డి, పాలకీర్తి. నరేంద్ర, బజాజ్ మీరా, మిద్దెపోగు. చిన్నపున్నయ్య, చీష్టి, సయ్యద్. సాజన్, అల్లు. వెంకటేశ్వర రెడ్డి, జొన్నలగడ్డ. శ్రీను, కాలే. రాంబాబు, కిల్లా. కాశీ, కోరే. సత్యం, గుండెబోయిన. శివ, బత్తుల. భైరగి, పంచాయతీ వార్డు సభ్యులు బ్యాటరి భాషా, జానీభాషా (అయ్యప్ప), సెల్ పాయింట్ కరీమ్, కొదమగుండ్ల శ్రీనివాసరావు, పేటసన్నేగండ్ల బుల్లాబ్బాయి, చింతపల్లి సర్పంచ్ శ్రీనివాసరావు, మస్తాన్ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.