contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

EPFO ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచనున్న కేంద్రం!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉండగా, ఆ మొత్తాన్ని రూ.21వేలకు పెంచనుందనే ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా దీనిని పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే, తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా పేర్కొంది.

ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 20 లేదా అంత కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న సంస్థలు తప్పనిసరిగా ఈపీఎఫ్‌ఓలో చేరాల్సిఉందిం. కానీ ఈ సంఖ్యను 10 నుంచి 15కు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే, ఈ ప్రతిపాదనను చిన్న-మధ్యతరహా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆ భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రమే మేలు జరుగుతుంది. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500 నుంటి రూ.15వేలకు పెంచారు.

పెంచితే ప్రయోజనం ఇదే
వేతన పరిమితిని పెంచితే దానివల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంలో 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతా లో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో జమ అవుతుంది. మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. గరిష్ఠ వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగులు, యజమాని చెల్లించాల్సిన వాటా కూడా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్‌ ఖాతాలో జమయ్యే మొత్తం పెరుగనుంది. దీంతో రిటైర్మెంట్‌ సమయానికి ఉద్యోగులు తమ భవిష్యనిధి నిల్వలను పెంచుకోవడానికి వీలువుతుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :