విజయనగరం: అయ్యన్నపేట రెవెన్యూలో ఉన్న ఎర్రచెరువు సుమారు 7 ఎకరాల స్థలం మరియు తిరుమల నగర్‌కు ఆనుకుని ఉంది. మూడంతస్తుల భవనం యజమాని ఈ చెరువును మట్టితో కప్పేస్తున్నాడు దీనివలన ఎర్రచెరువు కింద ఉన్న రైతుల భూములు ,అలాగే ఎర్రచెరువుకు ఆనుకుని ఉన్న తిరుమల నగర్, సరస్వతీనగర్ లోకి ఈ చెరువు నిండి కట్ట తెగి ఆ కాలనీలోకి కూడా నీరు వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టి చెరువు అన్యాక్రాంతం కాకుండా సర్వే చేసి మరికొంత మంది ముందు ముందు ఇటు వంటి దురాక్రమనలకు చేయకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకుకోవాలని స్థానికులు కోరుతున్నారు.