విజయనగరం జిల్లా: బొబ్బిలిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) మంగళవారం సందర్శించి పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ఆసుపత్రిని అందరికీ సులభంగా చేరుకునే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో ఆయన ఈ సందర్శన చేపట్టారు.
అసుపత్రిలో సేవల అమలుపై సిబ్బందితో మాట్లాడిన బేబీనాయన, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “ప్రజలందరికీ చేరువలో ఉండే విధంగా మెరుగైన సదుపాయాలతో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు చెప్తాడతామని హామీ ఇచ్చారు.