contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

EX DSP Praneeth Rao Case:ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎసిపి భుజంగరావు , ఎసిపి తిరుపతన్న అరెస్ట్

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. ఈ కేసులో మరింత మంది ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టు బయటపడుతోంది. ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్‌ ఆధారంగా.. పలువురు మాజీ పోలీస్‌ అధికారుల ఇళ్లతో పాటు ఓ న్యూస్ ఛానల్ ఎండీ ఇంట్లో కూడా పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ కేసులో పలువురు మాజీ ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించారని.. కాల్ రికార్డింగులను అడ్డం పెట్టుకుని బెదిరించి వందల కోట్లు వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది.

మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పలువురు అనుమానితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఇంటితో పాటు ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ సోదాల్లో భాగంగా ఓ అధికారి ఇంటి నుంచి 2 లాప్‌టాప్‌లు, 4 ట్యాబ్‌లు, 5 పెన్ డ్రైవ్‌లు, ఒక హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ అధికారులతో పాటు మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే.. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర కీలకమని అధికారులు భావిస్తున్నారు. కాగా.. ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇప్పటికే హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. ప్రణీత్ రావు కేసులో విచారణకు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న హాజరయ్యారు. గతంలో ఎస్ఐబీలో తిరుపతన్న అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. బంజారాహిల్స్ పీఎస్‌కు వచ్చిన తిరుపతన్నను.. పోలీసులు విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు 7 రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనకు సహకరించిన వారి అందరి పేర్లు ప్రణీత్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :